Manasa nee priyudu మనసా నీ ప్రియుడు 141

Manasa nee priyudu మనసా నీ ప్రియుడు

141. Manasaa! nee priyudu

పల్లవి : మనసా నీ ప్రియుడు యేసు నీ పక్షమై నిలిచెనే
మహదానందమే తనతో జీవితం
ఓ మనసా ఇది నీకు తెలుసా!

1.దివ్యమైన సంగతులెన్నో నీ ప్రియుడు వివరించగా
ఉత్సాహ ధ్వనులతో వూరేగితివే
ఉరుముల ధ్వనులన్నీ క్షణికమైనవేగా
దిగులు చెందకే ఓ మనసా
౹౹మనసా౹౹

2.ఆశ్చర్య కార్యములెన్నో నీ ప్రియుడు చేసియుండగా
సంఘము ఎదుట నీవు సాక్షివైతివే
ఇహలోక శ్రమలన్ని స్వల్పమేగా
కలవరమేలనే ఓ మనసా
౹౹మనసా౹౹

3.నిష్కళoకరాలవు నీవని నీ ప్రియుడు నిను మెచ్చెనే
కృపాతిశయముచే నీవు ఉల్లసించితివే
దుష్టుల క్షేమము నీ కంట బడగా
మత్సరపడకే ఓ మనసా
౹౹మనసా౹౹

Pallavi : Manasaa! nee priyudu yesu nee pakshamai nilichene
mahadhaanandhame thanatho jeevitham
o manasaa edhi neeku thelusaa!

1.Dhivyamaina sangathulenno nee priyudu vivarinchagaa
oosthaaha dhwanulatho ooregithive
oorumula dhwanulanni kshanikamainavegaa
dhigulu chendhake o manasaa!
!!Manasaa!!

2.Aascharya kaaryamulenno nee priyudu chesiyundagaa
sanghamu yedhuta neevu saakshivaithive
eha loka shramalanni swalpakaalamegaa
kalavaramelane o manasaa!
!!Manasaa!!

3.Nishkalankuraalavu neevani nee priyudu ninu mechene
krupaathishayamuche neevu oollasinchithive
dhustula kshemamu nee kanta badagaa
matsarapadake o manasaa!
!!Manasaa!!