Maha mahimatho nindina మహామహిమతో నిండిన 200

Maha mahimatho nindina మహామహిమతో నిండిన 

200. Maha mahimatho nindina

పల్లవి : మహామహిమతో నిండిన కృపా సత్యసంపూర్ణుడా
ఇశ్రాయేలు స్తోత్రములపై ఆశీనుడా యేసయ్యా
నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా

1.మహిమను విడిచి భువిపైకి దిగివచ్చి - కరుణతో నను పిలిచి
సత్యమును బోధించి చీకటిని తొలగించి - వెలుగుతో నింపితివి
సదయుడవై నా పాదములు తొట్రిల్లనివ్వక
స్థిరపరచి నీ కృపాలో నడిపించువాడవు
||మహామహిమతో||

2.కరములుచాచి జలరాసులలోనుండి - నను లేవనెత్తితివి
క్షేమమును దయచేసి నను వెంబడించి అనుదినము కాచితివి
అక్షయుడా ప్రేమనుచూపి ఆదరించినావు
నిర్మాలుడా భాహువు చాపి దీవించువాడవు
||మహామహిమతో||

3.పదివేలలోన గుర్తించదగిన - సుందరుడవు నీవు
అపరంజి పాదములు అగ్ని నేత్రములు - కలిగిన వాడవు
ఉన్నతుడా - మహోన్నతుడా ఆరాధించెదను
రక్షకుడా - ప్రభాకరుడా నిను ఆరాధించెదను
||మహామహిమతో||

Pallavi : Maha mahimatho nindina krupaa satyasampoornudaa
israayaelu stotramulapai aaseenudaa yaesayyaa
naa stutula simhasanam neekosamae yaesayyaa

Cha : 1. Mahimanu vidachi bhuvipaiki digivachchi -
karunatho nanu pilachi
satyamunu bhodinchi cheekatini tolaginchi -
velugutho nimpitivi
sadayudavai naa paadamulu thotrillanivvaka
sthiraparachi neekrupalo nadipinchuvaadavu
||mahamahimatho||

Cha : 2. Karamulu chaapi jalaraasulalonundi -
nanu laevanittitivi
kshaemamunu dayachaesi nanu vembadinchi -
anudinamu kaachitivi
akshayudaa praemanuchoopi aadarinchinaavu
nirmaludaa baahuvu chaapi deevinchuvaadavu
||mahamahimatho||

Cha : 3. Padivaelalona gurthinchadagina -
sundarudavu neevu
aparanji paadamulu agni naetramulu -
kaligina vaadavu
unnatudaa mahonnatudaa aaraadhinchedanu
rakshakudaa prabhakarudaa ninu aaraadhinchedanu
||mahamahimatho||