Madhuryame naa - మాధుర్యమే నా ప్రభుతో 21

 Madhuryame - మాధుర్యమే

21. Maadhuryame

పల్లవి : మాధుర్యమే నా ప్రభుతో జీవితం
మహిమానందమే – మహా ఆశ్చర్యమే

1.సర్వ శరీరులు గడ్డిని పోలిన వారైయున్నారు
వారి అందమంతయు పువ్వు వలె
వాడిపోవును – వాడిపోవును
||మాధుర్యమే||

2.నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే
దేవుని యందలి భయ భక్తులతో
ఉండుటే మేలు – ఉండుటే మేలు
||మాధుర్యమే||

3.నా విమోచన క్రయ ధనమును చెల్లించెను ప్రభువే
నా రోగమంతయు సిలువలో
పరిహరించెను – పరిహరించెను
||మాధుర్యమే||

4.వాడబారని కిరీటమునకై నన్ను పిలిచెను
తేజోవాసులైన పరిశుద్ధులతో
ఎపుడు చేరెదనో – ఎపుడు చేరెదనో
||మాధుర్యమే||

Pallavi : Maadhuryame Naa Prabhutho Jeevitham
Mahimaanandame – Mahaa Ascharyame

1.Sarva Shareerulu Gaddini Polina Vaaraiyunnaaru
Vaari Andhamanthayu Puvvu Vale
Vaadipovunu – Vaadipovunu
||Maadhuryame||

2.Nemmadhi Lekundaa Visthaaramaina Dhanamunduta Kante
Devuni Yandali Bhaya Bhakthulatho
Undute Melu – Undute Melu
||Maadhuryame||

3.Naa Vimochana Kraya Dhanamunu Chellinchenu Prabhuve
Naa Rogamanthayu Siluvalo
Pariharinchenu – Pariharinchenu
||Maadhuryame||

4.Vaadabaarani Kireetamunakai Nannu Pilichenu
Thejovaasulaina Parishuddhulatho
Epudu Cheredhano – Epudu Cheredhano
||Maadhuryame||