Goppa dhevuda గొప్ప దేవుడా మహోన్నతుడా 195

Goppa dhevuda గొప్ప దేవుడా మహోన్నతుడా

195. Goppa dhevudaa

పల్లవి : గొప్ప దేవుడా మహోన్నతుడా
ఆత్మతో సత్యముతో ఆరాధింతును
ఆనందింతును సేవింతును
ఆత్మతొ సత్యముతో ఆరాధింతును

1.నా దీనదశలో నన్నాధుకొని
నీ ఆశ్రయ పురములో చేర్చుకొని
నీ సన్నిధిలో నివశింప జేసీతివి
నీ ప్రభావ మహిమలకే నీ సాక్షిగా నిలిపితివి
||గొప్ప||

2.వివేకముతో జీవించుటకు
విజయముతొ నిను స్తుతించుటకు
నీ రక్షణతో అలంకరించితివి
నీ ఆనంద తైలముతో నన్నభిషేకించితివి
||గొప్ప||

3.సర్వసత్యములో నేనడచుకొని
నిత్య సియోనులో నేనిలుచుటకు
జీవపు వెలుగు లో నడిపించుచున్నావు
నీ సంపూర్ణత నాలో కలిగించు చున్నావు
||గొప్ప||

Pallavi : Goppa dhevudaa - mahonnathudaa
aathmatho sathyamutho aaraadhinthunu
aanadhinthunu sevinthunu
aathmatho sathyamutho aaraadhinthunu

1.Naa dheenadhashalo nannaadhukoni
nee aashraya puramulo cherchukoni
nee sannidhilo nivasimpajesithivi
nee prabhaava mahimaalake nee sakshigaa nilipithivi
!!Goppa!!

2.Vivekamutho jeevinchutaku
vijayamutho ninu sthuthinchutaku
nee rakshanatho alankarinchithivi
nee aanandhathailamutho nannaabhishekinchithivi
!!Goppa!!

3.Sarvasathyamulo ne naduchukoni
nithya seeyonulo neniluchutaku
jeevapu velugulo nadipinchuchunnaavu
nee sampoornatha naalo kaliginchuchunnaavu
!!Goppa!!