Dhivinelu Sthothrarhudaa దివినేలు స్తోత్రర్హుడా యేసయ్య 189

Dhivinelu Sthothrarhudaa దివినేలు స్తోత్రర్హుడా యేసయ్య

189. Dhivinelu Sthothraarhudaa

పల్లవి : దివినేలు స్తోత్రర్హుడా యేసయ్య
దిగిరానైయున్నా మహారాజువు నీవయ్య
మొదటివాడవు కడపటివాడవు యుగయుగములలో ఉన్నవాడవు

1.మానక నాయెడల కృప చూపుచున్నావు
మారదు నీ ప్రేమ తరతరములకు
మాటతప్పని మహనీయుడవు మార్పులేనివాడవు
నీవు చెప్పిన మంచి మాటలు నెరవేర్చువాడవు
నీ మాటలు జీవపు ఉటలు
నీ కృపయే బలమైన కోటలు
||దివినేలు||

2.దాచక నీ సంకల్పము తెలియచేయుచున్నావు
దయనొందిన నీ జనుల ముందు నడుచుచున్నావు
దాటివెళ్లని కరుణామూర్తివై మనవి అలకించావు
దీర్ఘశాంతముగలవాడవై దీవించువాడవు
నీ దీవెన పరిమళ సువాసన
నీ ఘనతే స్దిరమైన సంపద
||దివినేలు||

3.సియోను శిఖరముపై ననునిలుపుటకై
జేష్ట్యుల సంఘముగ నను మార్చుటకే
దివ్యమైన ప్రత్యక్షతతో నన్ను నిలిపియున్నావు
సుందరమైన నీ పోలికగా రూపుదిద్దిచున్నావు
నీ రాజ్యమే పరిశుద్ద నగరము
ఆ రాజ్యమే నిత్య సంతోషము
||దివినేలు||

Pallavi : Dhivinelu Sthothraarhudaa Yesayyaa
Digi Raanaiyunna Maharaajuvu Neevayyaa
Modativaadavu – Kadapativaadavu
Yugayugamulalo Unnavaadavu (2)

1.Maanaka Naa Yedala Krupa Choopuchunnaavu
Maaradu Nee Prema Tharatharamulaku (2)
Maata Thappani Mahaneeyudavu – Maarpuleni Vaadavu
Neevu Cheppina Manchi Maatalu – Neraverchuvaadavu
Nee Maatalu Jeevapu Ootalu
Nee Krupale Balamaina Kotalu (2)
||Dhivinelu||

2.Daachaka Nee Sankalpamu Theliyajeyuchunnaavu
Dayanondina Nee Janula Mundu Naduchuchunnaavu (2)
Daati Vellani Karunaamoorthivai – Manavi Aalakinchaavu
Deergha Shaanthamugalavaadavai – Deevinchuvaadavu
Nee Deevna Parimala Suvaasana
Nee Ghanathe Sthiramaina Sampada (2)
||Dhivinelu||

3.Seeyonu Shikharamupai Nanu Niluputake
Jyeshtula Sanghamugaa Nanu Maarchutake (2)
Divyamaina Prathyakshathatho – Nannu Nimpiyunnaavu
Sundaramaina Nee Polikagaa – Roopu Didduchunnaavu
Nee Raajyamu Parishuddha Nagaramu
Aa Raajyame Nithya Santhoshamu (2)
||Dhivinelu||