Dhevaa nee krupa దేవా నీ కృప
Dhevaa nee krupa దేవా నీ కృప
105. Dhevaa! nee krupa
పల్లవి : దేవా! నీ కృప నిరంతరం - మారనిదెపుడు నా ప్రభువా
నిత్యజీవము గలది ప్రియ ప్రభువా
1.పాపినగు నన్ను ఓ ప్రభువా - పరిశుద్ధపరచెను నీ కృపయే
పరమ స్వాస్థ్యము నొందుటకు - ప్రేమతో నన్ను పిలిచితివే
|| దేవా! నీ కృప ||
2.రక్షణ భాగ్యము పొందుటకు - రక్షక యేసు నీ కృపయే
నిత్యము నీతో నుండుటకు - నిత్య జీవము నిచ్చితివే
|| దేవా! నీ కృప ||
3.విశ్వాస జీవితం చేయుటకు - విజయము నిచ్చెను నీ కృపయే
శోధన బాధలు అన్నిటిలో - శక్తినొసంగి నడిపితివే
|| దేవా! నీ కృప ||
4.కృపలో నడుపుము ఓ దేవా - కృపతో నింపుము నా ప్రభువా
నిత్యము కృపలో నన్ను నడిపి - నిన్నెదుర్కొనుటకు శక్తినిమ్ము
|| దేవా! నీ కృప ||
Pallavi : Dhevaa! nee krupa nirantharam - maaranidhepudu naa prabhuvaa
nithya jeevamu galadhi priya prabhuvaa
1.Paapinagu nannu o prabhuvaa - parishuddha parachenu nee krupaye
parama swaasthyamu nondhutaku - prematho nannu pilachithive
!!Dhevaa!!
2.Rakshana bhaagyamu pondhutaku - rakshaka yesu nee krupaye
nithyamu neetho nundutaku - nithya jeevamu nicchithive
!!Dhevaa!!
3.Vishwaasa jeevitham cheyutaku - vijayamu nicchenu nee krupaye
shodhana bhaadhalu annitilo - shakthinosangi nadipithive
!!Dhevaa!!
4.Krupalo nadupumu o dheva - krupalo nimpumu naa prabhuvaa
nithyamu krupalo nannu nadipi - ninnedhurkonnutaku shakthi nimmu
!!Dhevaa!!