Dhayagala hrudhayudavu దయగల హృదయుడవు 173

 

Dhayagala hrudhayudavu దయగల హృదయుడవు

173. Dhayagala hrudhayudavu

పల్లవి : దయగల హృదయుడవు
నీ స్వస్త్యమును ఎన్నడు ఎడబాయవు
ఎడారిలో ఊటలను
జలరాసులలో త్రోవను ఏర్పరచువాడవు
సర్వలోకము నీకు నమస్కరించి
నిన్ను కొనియాడును

1.సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవమార్గము
సారము వెదజల్లు నీ జాడలె నాకు జీవన గమనము
శ్రేష్టమైన ఉపదేశముతో జీవముగలిగిన సంఘములో
నింపుచున్నావు దీవెనలతో నను నడుపుచున్నావు సమృద్దితో
||దయగల||

2.పరిశుద్దుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము
పరిశుద్దుల సహవాసమై నాకు క్షేమధారాము
విశ్వాసమందు నిలకడగా నీ రాకడ వరకు మెలకువగా
విసుగక నిత్యము ప్రార్ధింతును నిను నిశ్చలమైన నిరీక్షణతో
||దయగల||

3.పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము
పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము
ఆశ్రయమైనది నీ నామమే సజీవమైనది నీ త్యాగమే
ఆరాధింతును నా యేసయ్యా నిను నిత్యము కీర్తించి ఘనపరతును
||దయగల||

Pallavi : Dhayagala hrudhayudavu nee swaasthyamunu ennadu yedabaayavu
yedaarilo ootalanu jalaraasulalo throvalu yerparachuvaadavu
sarvalokamu neeku namaskarinchi ninnu koniyaadunu

1.Sathyaswaroopi nee dhivya vaakyame naaku jeevamargamu
saaramu vedhajallu nee jaadale naaku jeevana gamanamu
shrestamaina oopadheshamutho - jeevamu galigi sanghamulo
nimpuchunnavu dhivenalatho nanu - nadupuchunnavu samruddhitho
!!Dhayagala!!

2.Parishuddhudaa nee dhivya yochanale naaku entho ootthamamu
parishuddhula sahavaasame naaku kshemaadhaaramu
viswaasamandhu nilakadagaa - nee raakada varaku melakuvagaa
visugaka nithyamu praathinthunu - ninu nischalamaina nirikshanatho
!!Dhayagala!!

3.Paripoornudaa nee dhivya chitthame naaku jeevaharamu
paravaasigaa jeevinchute naaku nithya santhoshamu
aashrayamainadhi nee naamame - sajeevamainadhi nee thyaagame
aaraadhinthunu naa yesayyaa - nithyamu keerthinchi ghanaparathunu
!!Dhayagala!!