Avadhule Lenidi అవధులే లేనిది 186

Avadhule Lenidi అవధులే లేనిది

186. Avadhule Lenidi

పల్లవి : అవధులే లేనిది దివ్యమైన నీ కృప
అనంతమైనది ఆశ్చర్యమైనది (2)
యేసయ్యా నాపై నీవు చూపిన కృప
అమూల్యమైనది వర్ణించలేనిది (2)

1.ఊహించలేని హృదయానందమును
దుఃఖమునకు ప్రతిగా దయచేసినావు (2)
భారమెక్కువైనా తీరం కడుదూరమైనా
నీపై ఆనుకొందును
నేను గమ్యం చేరుకొందును (2)
|| అవధులే ||

2.సరిపోల్చలేని మధురమైన అనుభవం
వింతైన నీ ప్రేమలో అనుభవింపజేశావు (2)
సౌందర్యమైన అతిపరిశుద్ధమైన
నీ రూపము తలచుకొందును
నేను నీ కోసమే వేచియుందును (2)
|| అవధులే ||

3.లెక్కించలేని అగ్ని శోధనలో
ప్రయాసమునకు తగిన ఫలములిచ్చినావు (2)
వాడబారని కిరీటము నే పొందుటకు
వెనుకున్నవి మరచి
నేను లక్ష్యము వైపు సాగెద (2)
|| అవధులే ||

Pallavi : Avadhule Lenidi Divyamaina Nee Krupa
Ananthamainadi Aascharyamainadi (2)
Yesayyaa Naapai Neevu Choopina Krupa
Amoolyamainadi Varninchalenidi (2)

1.Oohinchaleni Hrudayaanandamunu
Dukhamunaku Prathigaa Dayachesinaavu (2)
Bhaaramekkuvainaa Theeram Kadu Dooramainaa
Neepai Aanukondunu
Nenu Gamyam Cherukondunu (2)
||Avadhule||

2.Saripolchaleni Madhuramaina Anubhavam
Vinthaina Nee Premalo Anubhavimpajesaavu (2)
Soundaryamaina Athi Parishuddhamaina
Nee Roopamu Thalachukondunu
Nenu Nee Kosame Vechiyundunu (2)
||Avadhule||

3.Lekkinchaleni Agni Shodhanalo
Prayaasamunaku Thagina Phalamulichchinaavu (2)
Vaadabaarani Kireetamu Ne Pondutaku
Venukunnavi Marachi
Nenu Lakshyamu Vaipu Saageda (2)
||Avadhule||