Ashraya dhurgamu ఆశ్రయదుర్గము నీవని 145
Ashraya dhurgamu ఆశ్రయదుర్గము నీవని
145. Aashraya dhurgamu
పల్లవి : ఆశ్రయదుర్గము నీవని
రక్షణ శృంగము నీవేనని
నా దాగుచోటు నీవేనని
నా సమస్తమును నీవేనని
1.నా మార్గములన్నింటిలో చీకటి అలుముకొననివ్వక
నీ వెలుగుతో కప్పినావు - నీ తేజస్సుతో నింపినావు
మరణాంధకారములో బంధించబడిన నీ జనులను
మహిమను ప్రసరింపజేసి స్నేహితులుగానే మలుచుకొన్నావు
|| ఆశ్రయ ||
2.నీ ప్రభావ మహిమాలను నిత్యము ప్రకటించగా
నీ ఆత్మతో నింపినావు - నాఆత్మకు తృప్తినిచ్చావు
కరువు కోరాలలో నలుగుచూ వున్న నీ ప్రజలకు
ఆకాశవాకిళ్లు తెరచి సమృద్థిగానే సంపదలిచ్చావు
|| ఆశ్రయ ||
3.నా విశ్వాస ఓడను బద్దలుకానివ్వక
నీ చేతితో నిలిపినావు - నీ కౌగిలిలో దాచినావు
ప్రమాదపు అంచులలో ఊగిసలాడు నీ ప్రియులను
జ్ఞాప్తికి తెచ్చుకొని సజీవులుగానే దరికి చేర్చావు
|| ఆశ్రయ ||
Pallavi : Aashraya dhurgamu neevani
rakshana shrungamu neevenani
naa dhaagu chotu neevenani
naa samasthamunu neevu neevenani
1.Naa maargamulannitilo chikati alamukonanivvaka
nee velugutho kappinaavu - nee thejassutho nimpinaavu
maranaandhakaaramulo bhandhinchabadina nee janulanu
mahimaanu prasarinpajesi snehithulugaane maluchukonnaavu
!!Aashraya!!
2.Nee prabhaava mahimalanu nithyamu prakatinchagaa
nee aathmatho nimpinaavu - naa aathmaku thrupthinicchaavu
karuvu koralalo naluguchoo vunna nee prajalaku
aakaasha vaakillu therachi samvruddhigaane sampadhalicchaavu
!!Aashraya!!
3.Naa vishwaasa odanu baddhalu kaanivvaka
nee chethilo nilipinaavu - nee kaugililo dhaachinaavu
pramaadhapu anchulalo oogisalaadu nee priyulanu
gnyapthiki thecchukoni sajeevulugaane dhariki cherchaavu
!!Aashraya!!