Anuragalu kuripinche అనురాగాలుు కురిపించే 167

 Anuragalu kuripinche అనురాగాలుు కురిపించే

167. Anuraagaalu kuripinche

పల్లవి : అనురాగాలుు కురిపించే నీ ప్రేమ తలచి
అరుదైన రాగాలనే స్వరపరచి
ఆనందగానలే సప్త స్వరాలుగా నే పాడనా
యేసయ్య నా హృదయ సీమను ఏలుమయ
నీ దివ్య సన్నిది చాలునయ

1.నీ జ్ఞాన ఆత్మయే వికసింపచేసెను నన్ను
సర్వ సత్యములలో నే నడచుటకు
మరపురాని మనుజాశాలను విడిచి
మనసార కొనియాడి జీవించెద ఇక నీ కోసమే
|| అనురాగాలు ||

2.అపురూప దర్శనమే బలపరుచుచున్నది నన్ను
వెనుదిరిగి చూడక పోరాడుటకు
ఆశ్చర్యకరమైన నీ కృప పొంది
కడవరకు నీ కాడినే మోయుట నా తుది నిర్ణయమే
|| అనురాగాలు ||

3.నీ నీతి నియమములే నడిపించుచున్నది నన్ను
స్వర్ణ కాంతిమయమైన నగరము కొరకు
అమూల్యమైన విశ్వాసము పొంది
అనుక్షణము నిన్ను తలచి హర్షించేనే నాలో నా ప్రాణమే
|| అనురాగాలు ||

Pallavi : Anuraagaalu kuripinche nee prema thalachi
arudhaina raagaalane swaraparachi
aanandhanganale saptha swaraalugaa nepaadanaa
yesayyaa naa hrudhaya seemamu yelumayaa
nee dhivya sannidhi chaalunayaa

1.Nee gnyaana aathmaye vikasimpajesenu nannu
sarva sathyamulo nenaduchutaku
marapuraani manujaashalanu vidachi
manasaara koniyaadi jeevinchedha eka neekosane
!!Anuraagaalu!!

2.Apurupa dharshaname balaparachuchunnadhi nannu
venudhirigi choodaka poraadutaku
aascharyakaramaina nee krupa pondhi
kadavaraku nee kaadi nemoyuta naa thudhi nirnayame
!!Anuraagaalu!!

3.Neenithi niyamamule nadipinchuchunnadhi nannu
swarnakaanthimayamaina nagaramu koraku
amulyamaina vishwasamu pondhi
anukshanamu ninnu thalachi harshinchene naalo naa praaname
!!Anuraagaalu!!