Adigadigo Paralokamu అదిగదిగో పరలోకము నుండి 148

Adigadigo Paralokamu  అదిగదిగో పరలోకము నుండి

148. Adigadigo Paralokamu

పల్లవి : అదిగదిగో పరలోకము నుండి
దిగివచ్చే వధువు సంఘము
వరుణివలే పరిపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది॥2॥

1.అల్ఫా ఓమేఘయైన నాప్రాణప్రియునికి
నిలువెల్ల నివేదించి మైమరతునే॥2॥
నాయేసురాజుతో లయము కాని రాజ్యములో
ప్రవేశింతునే... పరిపూర్ణమైన పరిశుద్ధులతో॥2॥
॥అదిగదిగో॥

2.కళ్యాణ రాగాలు ఆత్మీయ క్షేమాలు
తలపోయుచూనే పరవశింతునే ॥2॥
రాజాధిరాజుతో స్వప్నాల సౌధములో
విహరింతునే. నిర్మలమైన వస్త్రధారినై॥2॥
॥అదిగదిగో॥

3.జయించినవాడై సర్వాధికారియై
సింహాసనాశీనుడై నను చేర్చుకొనును ॥2॥
సీయోను రాజుతో రాత్రిలేని రాజ్యములో
ఆరాధింతునే.. వేవేల దూతల పరివారముతో ॥2॥
॥అదిగదిగో॥

Pallavi : Adigadigo Paralokamu Nundi
digivache Vaduvu Sangamu..
Varunivale Paripoorna
Soundaryamunu Darinchu konnadhi...

1.Alpha Omegha Aaina Naa Prana Priyuniki
Niluvella Nivedinchi Mayimarathune..
Naa Yesu Raajutho..
Layamu kaani Rajyamulo..
Pravesinthune.. Paripoornamaina
Parishuddulatho...
!!Adigadigo!!

2.Kalyana Raagalu Aathmeya Kshemalu
Thalapoyuchoone Paravasinthune..
Raajadhi Raajutho..
Swapnala Sowdamulo..
Viharinthune Nirmala Maina
Vastradharinai...
!!Adigadigo!!

3.Jayinchina Vaadai Sarvadhikaari Aayi
Simhasanaseenudai Nanu Cherchukonunu...
Siyonu Raajutho..
Raathri leni Raajyamulo..
Aaradhinthune...
Vevela Doothala Parivaramutho..
!!Adigadigo!!