Adagaka munupe అడగక మునుపే 153

Adagaka munupe  అడగక మునుపే

153. Adagaka munupe

పల్లవి : అడగక మునుపే నా అక్కరలన్నియు ఎరిగిన వాడవు
అడిగిన వాటికింటే అత్యధికముగా చేయుచున్నావు
యేసయ్య నీ కృప పొందుటకు నాలో ఏమున్నదని?

1. నాకు సహాయము చేయుటకై - నీ దక్షిణ హస్తము చాపితివే
సత్య సాక్షిగా నేనుండుటకై - ఉపకరములెన్నో చేసితివే
హల్లెలూయ - ఉపకరములెన్నో చేసితివే
||అడగక||

2. నాకు దీర్గాయువునిచ్చుటకే - నీ హితోపదేశము పంపితివే
నిత్యజీవము నేపొందుటకు - పునరుత్థానము నొందితివే
హల్లెలూయ - పునరుత్థానము నొందితివే
||అడగక||

3. నాకు ఐశ్వర్యమునిచ్చుటకే - నీ మహిమైశ్వర్యము విడిచితివే
మహిమలో నీతో నేనుండుటకే - మహిమాత్మతో నన్ను నింపితివే
హల్లెలూయ - మహిమాత్మతో నన్ను నింపితివే
||అడగక||

Pallavi : Adagaka munupe naa akkaralanniyu yerigina vaadavu
adigina vaatikante athyadhikamugaa cheyuchunnaavu
yesayyaa nee krupa pondhutaku naalo yemunnadhani?

1.Naaku sahayamu cheyutakai - nee dhakshina haasthamu chaapithive
sathya saakshigaa nenundutakai - oopakaaramulenno chesithive
hallelooya - oopakaaramulenno chesithive
!!Adagaka!!

2.Naaku dheergaayuvunicchutake - nee hithopadheshamu pampithive
nithyajeevamu neetho nepondhutaku - punarutdhaanamu nondhithive
hallelooya - punarutdhaanamu nondhithive
!!Adagaka!!

3.Naaku aishwaryamunicchutake - nee mahimaishwaryamu vidichithive
mahimalo neetho nenundutake - mahimaathmatho nannu nimpithive
hallelooya - mahimaathmatho nannu nimpithive
!!Adagaka!!