Parimalathailam Neeve పరిమళతైలం నీవే Hosanna Ministries Song 241
Hosanna Ministries 2024 new Album Nithyathejudaa song : 241 పరిమళతైలం నీవే - Parimalathailam Neeve పరిమళతైలం నీవే తరగని సంతోషం నీలో జీవన మకరందం నీవే తియ్యని సంగీతం నీవే అ. ప: తరతరములలో నీవే నిత్యసంకల్ప సారధి నీవే జగములనేలే రాజా నా ప్రేమకు హేతువు నీవే పల్లవి : ఉరుముతున్న మెరుపులవంటి తరుముచున్న శోధనలో (2) నేనున్నా నీతో అంటూ నీవే నాతో నిలిచినావు క్షణమైనా విడువక ఔదార్యమును నాపై చూపినావు నీ మనసే అతి మధురం అది నా సొంతమే.. || పరిమళ || 1. చీల్చబడిన బండనుండి నా కొదువ తీర్చి నడిపితివి నిలువరమగు ఆత్మ శక్తితో కొరతలేని ఫలములతో నను నీ రాజ్యమునకు పాత్రుని చేయ ఏర్పరచుకొంటివి నీ స్వాస్థ్యములోనే చేరుటకై అభిషేకించినావు నీ మహిమార్ధం వాడబడే నీ పాత్రను నేను.. || పరిమళ || 2. వేచియున్న కనులకు నీవు కనువిందే చేస్తావని సిద్ధపడిన రాజుగా నీవు నాకోసం వస్తావని నిను చూచిన వేళ నాలో ప్రాణం ఉద్వేగభరితమై నీ కౌగిట ఒదిగి ఆనందముతో నీలో మమేకమై యుగయుగములలో నీతో నేను నిలిచిపోదును… ||పరిమళ || Parimalathailam Neeve Song Lyrics in English Parimalathailam Neeve Tharagani Santhosham Neelo Jeeva...